మగ్గం వర్క్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.
ఈ నెల 17 నుంచి మూడో బ్యాచ్ శిక్షణ ప్రారంభం.
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మగ్గం వర్క్ ఉచిత శిక్షణ మూడో బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.
ఈ నెల 17వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, 6 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని మంగళవారం నుంచి నస్రుల్లాబాద్‌లోని ఆర్‌సెటి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ పొందడంతో పాటు శిక్షణ అనంతరం స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: 9247540478 నంబర్‌ను సంప్రదించాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ కోరారు.


Comments