మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం.
14వ వార్డులో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని 14వ వార్డు కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి–సారయ్య అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని వారు పిలుపునిచ్చారు.వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని మా గార్డెన్ సమీపంలో పెసరు కృష్ణవేణి–సారయ్య ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, యువత, మహిళలకు మట్టి విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల పండుగ సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోవడంతో చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.“మట్టి వినాయకుడినే పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డాల శేఖర్, గట్టు సురేందర్, లత, అశోక్, పద్మ, కొంగరి రమేష్, వల్లాల పల్లవి, నిర్మల, సౌమ్య, రుద్రమదేవి, రమ, పెండ్యాల నరసయ్య, రాజమ్మ, స్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments