నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!

బిజిగిరి షరీఫ్‌లో 1992–93 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!

జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

చిన్ననాటి స్నేహాలు.. గురువుల బోధనలు.. పాఠశాల ప్రాంగణంలో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 1992–93 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి సందడి చేశారు. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల్లోని అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ బాల్య స్నేహాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆత్మీయంగా పలకరించుకోవడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన రాజిరెడ్డి, రాజగోపాల్, నర్సింహారెడ్డి, వెంకటేశ్వరచారి, చంద్రమోహన్, రాజేశం తదితర గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో గురువులను సత్కరించి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల కృతజ్ఞతను చాటుకున్నారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజేందర్, మహేందర్, సంపత్రావు, జలీల్, శ్రీనివాస్, చంద్రశేఖర్, వీరేశలింగం, పోచయ్య, ఉమారాణి, స్వరూప, విజయ, ధనలక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.