ప్రజా భద్రతలో సీసీటీవీల పాత్ర గొప్పది.

నస్రుల్లాబాద్ ఎస్సై వెంకటరావు.

ప్రజా భద్రతలో సీసీటీవీల పాత్ర గొప్పది.

నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని నస్రుల్లాబాద్ మండల ఎస్సై వెంకటరావు అన్నారు. యువత దేశ భద్రత, ప్రజా రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి), కామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీసీటీవీ కెమెరా శిక్షణ రెండో బ్యాచ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై వెంకటరావు దీప ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో దేశ భద్రత విషయంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ప్రజల రక్షణతో పాటు నేరాల గుర్తింపు, నియంత్రణ, దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఆర్‌సెటి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.
ఆర్‌సెటి సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందే దిశగా యువత ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్‌టీ సురేష్, అధ్యాపకులు జీవన్ నాయక్, సూర్యతేజ, సంస్థ ప్రతినిధులు సార్థిక, శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.