కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా ఎడ్ల సారంగపాణి.
చిల్పూర్,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన ఎడ్ల సారంగపాణిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేముల మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
తనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడంపై ఎడ్ల సారంగపాణి హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిరా, యువ నాయకులు సింగపురం ఇమ్మానుయేల్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ వర్గాల సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానని సారంగపాణి తెలిపారు.


Comments