వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
వేలేరు, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు పోలీసు స్టేషన్ లో వేలేర్ సర్పంచ్ పై ధర్మసాగర్, వేలేరు మండలాల విలేకరులు పలువురు ఫిర్యాదు చేశారు. ఓ విలేకరిపై సర్పంచ్ కక్షపూరితంగా కేసు నమోదు చేశారని పేర్కొంటూ పలువురు విలేకరులు వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వేలేరు ఎస్సైకి పిటిషన్ అందజేశారు. ఇటీవల గ్రామంలో చోటుచేసుకుంటున్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన ఓ విలేకరిపై సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసు పెట్టారని ఆరోపించారు. వార్తలు రాసినందుకు విలేకరిని లక్ష్యంగా చేసుకుని పోలీసు కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. విలేకరులపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు ఎస్సైని కోరారు. సర్పంచ్‌పై విచారణ జరిపి, విలేకరిపై కక్షపూరితంగా కేసు పెట్టినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల సర్పంచ్ ఇంటి జీపీ సిబ్బంది ఇదేం తీరు అంటూ, ఓ సర్పంచ్ ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికులు సర్పంచ్ ఇంటి సొంత పనులు చేస్తుండగా పలువురు విలేకరులు వార్తలు ప్రచురించారు. అయితే ఒక్క విలేకరిపై మాత్రమే కేసు నమోదు చేయడం కక్ష్య పూరితమేనని విలేకరులు ఫిర్యాదు లో పేర్కొన్నారు.


Comments