దొడగుంటపల్లిలో మరో డెంగీ కేసు.
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఒక డెంగీ కేసు నమోదు కాగా, తాజాగా మరో కేసు వెలుగులోకి రావడంతో వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.డెంగీ నిర్ధారణ అయిన వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సిబ్బంది, దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.


Comments