పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
జఫర్గడ్,సెప్టెంబర్15( తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 42లక్షల 04వేల 872రూపాయల చెక్కులను అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్కువ నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని తెలిపారు. నియోజకవర్గంలో నెలకు సుమారు 150కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 50 కుటుంబాలకు ఎల్ఓసిల ద్వారా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడే పేద ప్రజలకు ఎల్ఓసిల ద్వారా, వైద్యం చేయించుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా
ఎల్ నీనో ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులలో కరువు ఏర్పడిందని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాత్రం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కరువు ప్రభావం కనిపించకుండా రిజర్వాయర్ల నుండి కాలువల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే వర్షాకాలం నాటికి 6L, 7L కాలువలు పూర్తి చేసి జఫర్గడ్ కు గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీమండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Comments