చింతకుంట కెనాల్‌లో నీరు విడుదల చేయాలి.

చింతకుంట కెనాల్‌లో నీరు విడుదల చేయాలి.

*గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: గంగుల కమలాకర్*

కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్‌ నగరంలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కోరారు. నిమజ్జనానికి ప్రధానంగా ఉపయోగించే చింతకుంట కెనాల్‌లో వెంటనే నీటిని విడుదల చేసి, భక్తులకు, గణేష్‌ ఉత్సవ కమిటీలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు.

నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్‌, తాగునీరు, రహదారులు, భద్రత తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు) మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.