మిషన్ భగీరథ అధికారులపై సర్పంచుల ఆగ్రహం.
పెద్దమందడి మండల సర్వసభ సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి.
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం చూపకపోవడంపై నిలదీశారు.పలు గ్రామాల్లో పైపులైన్లు, నీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్పంచులు తెలిపారు. గత సమావేశంలో హామీ ఇచ్చినప్పటికీ సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తమకు ఎదురవుతోందని పేర్కొన్నారు.తాగునీటి వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సమావేశంలో పలువురు సూచించారు.


Comments