తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ గర్జన.
అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో భారీ బైక్ ర్యాలీ.
Views: 0
On
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు, జిల్లా పార్టీ నాయకులు
, జోన్ల కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామాల కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Sep 2026 14:22:57
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)
మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...


Comments