తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
తహశీల్ధార్ కు బిజెపి నాయకుల వినతి .
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల చారిత్రక ఆకాంక్షను గౌరవిస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ కాడగయా రమేష్, ఇతర వెనుకబడిన తరగతుల విభాగం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, నాయకులు కన్నెబోయిన అశోక్ యాదవ్, కట్ల అనిల్ కుమార్, బోసు నాయక్, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments