టీజేఏ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎండి రషీద్.
ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని ఏకగ్రీవ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజేఏ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎండి రషీద్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సందర్భంగా నూతన ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రషీద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి , తనకి పదవీ బాధ్యతలు అందజేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగస్వామి లకు కృతజ్ఞతలు ప్రకటించారు. సంఘం బలోపేతం తో పాటు జర్నలిస్టుల సమస్యల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు. టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగస్వామి ప్రత్యేకంగా తనను ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నియమించడంలో తనపై గల విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లో తాను వమ్ము చేయనని రషీద్ ప్రకటించారు. జర్నలిస్టులు ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో తమ వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్నారని వారి సేవలను ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఉపయోగించుకునే విషయంలో వారి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో అనుభవాన్ని జీవిత సారాన్ని గ్రహించిన సీనియర్ జర్నలిస్టుల సలహాలు, సూచనలు సహకారంను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమిష్టి నిర్ణయాలతో ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి , ఖమ్మం జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు. అదేవిధంగా తోటి టీజేఏ సభ్యులు, ఇతర
జర్నలిస్టులు కూడా ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనతోపాటు పాటుపడే విషయంలో తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని బాధ్యతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం,యూనియన్ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ అసోసియేషన్ పురోగతికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులు మరియు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎండి రషీద్‌ను టీజేఏ జిల్లా నాయకులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. మణికుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే ఖాసిం, జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తి రామకృష్ణ, కోశాధికారి బొడపట్ల సతీష్, జిల్లా నాయకులు వాసం రాజేంద్రప్రసాద్, నల్లమోతు శ్రీనివాసరావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎండి రషీద్, ప్రధాన కార్యదర్శి ఎం. చిన్ని మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.


Comments