మంచి చదువులు చదువుకోండి.. మీకు అండగా నేను ఉంటా.
రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాజీ ఎంపీ.
కొత్తకోట,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులు కష్టపడి మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన తల్లి పద్మమ్మ, సోదరుడు డాక్టర్ వెంకట్ రంగారెడ్డి జ్ఞాపకార్థం రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్‌తో కలిసి బూట్లు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా విద్యార్థులకు బూట్లు అందజేస్తామని తెలిపారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. కానాయపల్లి వాకింగ్ గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, సర్పంచ్ బొంతం శిరీష సాయి, ఉప సర్పంచ్ అంజి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, ఉద్యమకారులు, వాకింగ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments