భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.

భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.

*ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం*

*సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం*

కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. యువత, మహిళలు, వయోవృద్ధులు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

అనంతరం యుఐడీఎఫ్ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసIMG-20260916-WA0018తులు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.