ఆకస్మిక తనిఖీతో అధికారుల్లో అలర్ట్.

ఆకస్మిక తనిఖీతో అధికారుల్లో అలర్ట్.

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రవి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.. అధికారులు నిర్వహిస్తున్న ఫైళ్లు, రికార్డులు, దస్త్రాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలతో పాటు కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రికార్డులు, దస్త్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రసాద్ రావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.