పొంగులేటి పై బి ఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు తగదు.

మేకల మల్లిబాబు యాదవ్.

పొంగులేటి పై బి ఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు తగదు.

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంచలనాత్మక నిర్ణయాలతో పాలన చేస్తుంటే, ఓర్వలేని 
బిఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అన్న భయం తో ప్రభుత్వ కీలక నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, దానిలో భాగంగా రెవిన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అతి చేరువవుతున్న  ప్రియతమ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలను పొంగులేటి ముఖ్య అనుచరులు, డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తలు, పొంగులేటి అభిమానుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ధ్వంసం చేయడం జరిగిందని  58,59 జీవోలను కొత్తగా ప్రవేశపెట్టి ఎక్కడ ఖాళీ భూములు ఉంటే ఈ జీవో ను ఉపయోగించి టిఆర్ఎస్ నాయకులు  భూ కబ్జాలు చేశారని, ₹1,25,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయంగామారిందని,టిఆర్ఎస్ పార్టీ వారికి ఏటీఎం గా మారిపోయిందని, ధరణి పేరుతో గ్రామంలో రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యపరచడం జరిగిందని, ధరణి పేరుతో పట్టాలు ఇవ్వకుండా అతి కఠినమైన నిర్ణయాలతో, భూ రిజిస్ట్రేషన్లు జరగలేదని, ఎంతో లోప భూయిష్టంగా   ఉన్న ధరణి స్థానంలో అతి సులభంగా సామాన్యులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా భూభారతి ని ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలందరికీ పారదర్శకమైన పరిపాలన అందడంతో జీర్ణించుకోలేక, కనీసం అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర పరిస్థితులను సభా దృష్టికి తీసుకురాలేని ప్రతిపక్ష నాయకుడు ఉండడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేసి, మాట ఇచ్చిన విధంగా  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేనియెడల వారికి తగురీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని, మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండిపాడు గ్రామపంచాయతీ బాధ్యులు గుగులోతు రవి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, బాదావత్ నాగరాజు,వడ్డెర సంఘం మండల అధ్యక్షులు, దేరంగుల తిరపయ్య, బండి ఉపేందర్, తురక బిక్షం మొగిలి శ్రీను, చల్ల మల్లయ్య పగిడిపల్లి రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.