నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.

మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికపై ప్రజలతో చర్చ.

నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.

స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పురమాని కోమల ఐలోని అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధికి అవసరమైన మూడేళ్ల ప్రణాళికపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నకారు రైతుల పొలాల్లో వ్యవసాయ బావుల వద్ద వ్యవసాయ కుంటల ఏర్పాటు, పంట పొలాల మధ్య నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించారు.

అలాగే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అవసరమైన అనుసంధాన రహదారులకు కంకర నిర్మాణం చేపట్టడం, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు మట్టి రోడ్ల నిర్మాణం, వాటిపై కంకర వేయడం వంటి పనులను కూడా గ్రామసభలో ప్రతిపాదించారు.
గ్రామసభలో ప్రజలు సూచించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న పనులకు త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకుడు, గ్రామ సంస్థల సహాయకులు, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ. నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.
స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు....
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.