22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్ నాయుడు.
వనపర్తి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులతో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అనేక ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత భూములను విక్రయించుకోవడానికి, అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉండాల్సిన అవసరం లేని ప్రైవేటు, పట్టా భూములను గుర్తించి 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు. అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు.భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సుధాకర్ నాయుడు కోరారు. ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.అనంతరం సుధాకర్ నాయుడు, పార్టీ నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి. రాములు, శ్రీనివాసరెడ్డి, చిట్యాల బాలరాజు, కే. లక్ష్మయ్య, ఆవుల శ్రీను, సితార, యాదయ్య, రమేష్ సింగ్, రాఘవేందర్ గౌడ్, శివ, సత్యం, ఫారుక్, శివయ్యచారి, ఉపేందర్, అప్పాయిపల్లి బాలయ్య, డి. బాలరాజు, కే. గిరి, శంకర్, రాజు, దాసు తదితర గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Comments