విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.

సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.

వనపర్తి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన ప్రథమ పూజ్యుడు  విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో ప్రజల సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం శంకర్ గౌడ్‌తో పాటు బైరోజు చంద్రశేఖర్‌ను కౌన్సిలర్ చీర్ల చందర్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శామ్ సుందర్, నందిమల్ల రమేష్, శ్రీనివాస్, యుగంధర్, సదానందం గౌడ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.