కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి.
పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి.
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యు
త్ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు విద్యుత్ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని అన్నారు.వెల్టూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని సుమారు 12 గ్రామాల రైతులకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని కోరారు.అనంతరం మండల విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


Comments