ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
కరీంనగర్ మార్కెట్ యార్డులో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ యంత్రాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు, పాల కేంద్రం, ఆహార పదార్థాల నాణ్యత పరీక్షల ల్యాబ్, కూరగాయలు కోసే–కడిగే యంత్రాలు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులు, నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆఫ్
ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Comments