బొమ్మకల్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం.

విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారానికి ప్రాధాన్యం.

బొమ్మకల్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం.

సైదాపూర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):

సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ZPHS పాఠశాలలో బుధవారం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కొంకట పవన్, గుండెల్లి రాజవ్వ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ . మారుతి మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.
పాఠశాల హాజరు పెంపునకు దోహదం
బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.