22-ఎ నిషేధిత జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను తొలగించాలి: డా రామనాథం.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అనంతరం రామనాథం మాట్లాడుతూ 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని 22-ఏ నిషేధిత జాబితాలో పట్టా భూములు, ఇంటి స్థలాలు ఉండటం వల్ల వాటి రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాలలో ఈ సమస్య అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో 22-ఎ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములను సబబే కానీ అధికారుల తప్పిదాల కారణంగా ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు, తర తరాలుగా తమ భూములను అనుభవిస్తూ, పట్టాదారు పాస్‌బుక్ ఇతర హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ 22-ఏ జాబితాలో ఉండటం వల్ల భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని తెలిపారు, కావున సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ భూములు కాని ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరామని అన్నారు,
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండబాల కరుణాకర్, వనమా వాసు, మల్లాది హనుమంతరావు, అరెం వరలక్ష్మి, అరెం రామయ్య, తాత సుధాకర్, నాగార్జున శ్రీను, వాసిరెడ్డి భాస్కరరావు, మందపల్లి కోటి, మంద వెంకటనారాయణ, నూక హనుమంతరావు, మారేడు పుల్లారావు, పాలడుగు కృష్ణప్రసాద్, మేకల సత్యవతి, మందపల్లి రజిని, నల్లమాస మల్లయ్య, నల్లమల శ్రీను, రాయల కోటేశ్వరరావు, అశ్వినీ కుమార్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.


Comments