రజక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
Views: 0
On
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రజక సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా బోనగిరి కనకయ్య, వెలిశాల వెంకన్న, ఉపాధ్యక్షుడిగా బోనగిరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి రంజిత్, కోశాధికారులుగా వెలిశాల శేఖర్, గాజ రవి ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా ఎలిశాల రాజమౌళి, బోనగిరి స్వామి, గౌరవ సభ్యులుగా ఎలిశాల యాదగిరి, బోనగిరి రాములు, వెలిశాల రమేష్, గట్టయ్య, బోనగిరి నగిరి, సమ్మయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి, రజకుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Sep 2026 22:04:42
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు విద్యుత్ కోతలతో సాగునీరు...


Comments