భారతీయులను ఏకం చేసిన పండుగ వినాయక చవితి.

పలుస శంకర్‌ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

భారతీయులను ఏకం చేసిన పండుగ వినాయక చవితి.

వనపర్తి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

భారతీయులను ఐక్యంగా నిలిపిన పండుగ వినాయక చవితి అని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌ గౌడ్‌ అన్నారు. వనపర్తి పట్టణంలోని మణికంఠ కాలనీలో వినాయక చవితి సందర్భంగా కాలనీ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పలుస శంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాలగంగాధర్‌ తిలక్‌ వినాయక మండపాలను ప్రజా వేదికలుగా మలిచి జాతీయ భావాన్ని ప్రజల్లో పెంపొందించారని గుర్తుచేశారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు.అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం లేదని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట కలిసి ప్రసాదాన్ని స్వీకరించడం భారతీయుల ఐక్యతకు ప్రతీక అని అన్నారు. అన్నదానం నిర్వహించిన వారికి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వాదాలు ఉంటాయని, అన్నం పెట్టిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుందని శంకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేశీ రాములు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు మద్దిలేటి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శివకుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి, గోపాల్‌, కేశవులు, బీసీ రెడ్డి, నాగరాజ్‌, మైత్రి, శైలజ, నరేష్‌, రమేష్‌, రాజేంద్ర ప్రసాద్‌ చారి, స్వప్న, హేమలత, పుష్పలత, కళ్యాణి తదితరులతో పాటు స్థానిక భక్తులు, కాలనీ వాసులు, సాహితీ కళా వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!