ఉచిత పథకాలు వద్దు.. ఉచిత విద్య, వైద్యమే ముద్దు.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో తమ్మినేని వీరభద్రం.
జనగామ, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో పలువురు సీపీఎం పార్టీలో చేరారు. చిల్పూర్ మండలంలోని లింగంపల్లి, కొండాపూర్ గ్రామాలకు చెందిన ఎనిమిది కుటుంబాల ప్రతినిధులు పార్టీలో చేరారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం వారికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత పథకాల పేరుతో తాత్కాలిక ప్రయోజనాలు కల్పించడం కంటే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే నిజమైన సంక్షేమమని అన్నారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పేదలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు.
పార్టీలో చేరిన వారిలో అపరాధపు రవి కుమార్, నాగవెల్లి సాయి, బానోత్ రాజేందర్, పెండ్లి రాజు, కర్రె సంపత్, కండ్లకోలు ప్రవీణ్ కుమార్ (లింగంపల్లి), గుండబోయిన సదానంద్, గుండబోయిన రాజు (కొండాపూర్) ఉన్నారు. కార్యక్రమంలో చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments