గద్వాల కృష్ణకు ఘన సన్మానం.

గద్వాల కృష్ణకు ఘన సన్మానం.

వనపర్తి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): 

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కోర్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన గద్వాల కృష్ణను వనపర్తి జిల్లా ఎస్టీ, ఎస్సీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం గద్వాల కృష్ణ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చింతకుంట విద్యాబాబు, బోజి రాజు, గద్వాల వెంకటేష్‌, యాదవల్లి వీరప్ప, రామచంద్రయ్య, డి. వెంకటేష్‌ తదితరులు మాట్లాడుతూ.. గద్వాల కృష్ణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సాధనతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వేతనాలు, పేదలకు పింఛన్ల వంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.అనంతరం గద్వాల కృష్ణ మాట్లాడుతూ.. తనను సన్మానించి అభినందించిన జిల్లా ఎస్టీ, ఎస్సీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!