వెల్టూర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
ప్రేమసాగర్, వడ్డే శేఖర్, దిండు రవీందర్ కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం వచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమసాగర్, కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్, దిండు రవీందర్ అభినందనలు తెలిపారు. వెల్టూర్‌లో పాఠశాల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే స్వయంగా స్థల పరిశీలనకు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమసాగర్ మాట్లాడుతూ.. వెల్టూర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవ అభినందనీయమన్నారు. స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు కూడా ఈ పాఠశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు.కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వెల్టూర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పెద్దమందడి - ఖిల్లా ఘనపూర్ మండలాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నాయకుడు దిండు రవీందర్ మాట్లాడుతూ..వెల్టూర్‌లో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కావడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.వెల్టూర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు పూర్తయితే స్థానిక విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.


Comments