ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

వెల్టూర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

– ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెద్దమందడి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి శుక్రవారం పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. పాఠశాల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, స్థల విస్తీర్ణం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం సంతోషకరమని, ఈ పాఠశాలను వెల్టూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వంతో విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో వెల్టూర్‌తో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమనిIMG-20260918-WA0010 అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!