కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్ రూపురేఖలు మారాయి.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్ రూపురేఖలు మారాయి.

*ప్రధాని మోదీ ఆశీస్సులు,బండి సంజయ్ చొరవతో నగరానికి భారీగా నిధులు: యాదగిరి సునీల్‌రావు*

కరీంనగర్, సెప్టెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):

 కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్ నగర రూపురేఖలు మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. శుక్రవారం ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చొరవతో నగరానికి వివిధ పథకాల ద్వారా భారీగా నిధులు వస్తున్నాయని తెలిపారు.

స్మార్ట్ సిటీ, అమృత్, యూఐడీఎఫ్, యూసీఎఫ్‌తో పాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ, ఆర్‌ఓబీ, సీఆర్‌ఎఫ్ తదితర పథకాల ద్వారా నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో 46 పనులకు గాను సుమారు 40 పనులు పూర్తయ్యాయని, మరో ఆరు పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా నగరాభివృద్ధికి రూ.934 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు.

అమృత్ పథకం కింద కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం రూ.132 కోట్ల నిధులు తీసుకొచ్చామని, వీటితో కొత్త ట్యాంకులు, పైప్‌లైన్లు, ఫిల్టర్‌బెడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కరీంనగర్–హన్మకొండ జాతీయ రహదారి పనులు రెండున్నరేళ్లలో పూర్తయ్యాయని, జగిత్యాల–కరీంనగర్ రహదారికి కూడా అనుమతులు లభించాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

యూసీఎఫ్ ప్రాజెక్టులో కరీంనగర్‌ను చేర్చి రూ.840 కోట్ల నిధులు తీసుకురావడంలో బండి సంజయ్‌కుమార్ కీలక పాత్ర పోషించారని సునీల్‌రావు పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై బండి సంజయ్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు నగర అభివృద్ధికి తాము తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు.

ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు సోమిడి వేణు, పొన్నం లక్ష్మి-మొండయ్య, నాంపల్లి రేణుక-శ్రీనివాస్, కర్రె పద్మ-అనిల్, కో-ఆప్షన్ సభ్యులు సర్దార్ బల్వీర్ సింగ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ దీపక్, బీజేపీ నాయకులు కటకం లోకేష్ కుమార్, టి.చంద్రమౌళి, పండుగ నాగరాజు, వాసు, సత్యనారాయణ రెడ్డి, కుంభం అనిల్ కుమార్, హమీద్, దాసరి రమేష్, ఐలేని రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!