వాయిదా పడిన పరీక్షలకు వెంటనే కొత్త షెడ్యూల్ ఇవ్వాలి.

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన గట్టు మన్నెం.

వాయిదా పడిన పరీక్షలకు వెంటనే కొత్త షెడ్యూల్ ఇవ్వాలి.

వనపర్తి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వాయిదా పడిన మధ్యంతర పరీక్షలకు వెంటనే కొత్త షెడ్యూల్ విడుదల చేసి, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు, మోజెర్ల మాజీ సర్పంచ్ గట్టు మన్నెం కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గట్టు మన్నెం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు జరగాల్సిన మధ్యంతర పరీక్షలు కొందరి నిరసనలు, పరీక్షల బహిష్కరణకు పిలుపు నేపథ్యంలో వాయిదా పడ్డాయని తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరారు. పరీక్షలను బహిష్కరించాలనుకునే విద్యార్థులు తమ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని, అయితే ఇతర విద్యార్థులను అడ్డుకోవడం, బెదిరించడం, బలవంతం చేయడం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97పై విద్యార్థులకు ఉన్న అభ్యంతరాలను సంబంధిత ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి శాంతియుతంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించి, పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం అందించాలని గట్టు మన్నెం విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!