పరిశుభ్రతతోనే గ్రామాల అభివృద్ధి.

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్‌ గౌడ్‌.

పరిశుభ్రతతోనే గ్రామాల అభివృద్ధి.

పెద్దమందడి,సెప్టెంబరు18(తెలంగాణ ముచ్చట్లు):

స్వచ్ఛతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామ సర్పంచ్‌ పలుస శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ర్యాలీ చేపట్టి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ పలుస శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇళ్లలో నిత్యావసరంగా వినియోగించే కూరగాయల వ్యర్థాలు, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్తబుట్టల్లో వేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌కు అందించాలని సూచించారు.బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. త్వరలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నాలుగు చెత్తబుట్టలను అందజేస్తామని సర్పంచ్‌ తెలిపారు. గ్రామ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జిల్లా సమన్వయకర్త రమేష్‌, క్షేత్ర సహాయకులు, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌, పాఠశాల సిబ్బంది, జానయ్య, రాములు, గ్రామ పెద్దలు రాములు, వెంకటయ్య, శ్రీకాంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!