కరీంనగర్‌లో వినాయక మండపాలను సందర్శించిన  బండి సంజయ్.

కరీంనగర్‌లో వినాయక మండపాలను సందర్శించిన  బండి సంజయ్.

*గణనాథుడికి ప్రత్యేక పూజలు*

*ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష*

కరీంనగర్, సెప్టెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):

 గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!