రత్నతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.

రత్నతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.

చిల్పూర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని లింగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రత్నతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం రత్నతండాను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంది.సుమారు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన రత్నతండాలో 13 కుటుంబాలకు చెందిన 60 మంది నివసిస్తున్నారని రాపర్తి రాజు తెలిపారు. తండాకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్య, వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

తండాలో రేషన్ దుకాణం, అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశా కార్యకర్తలు కూడా సక్రమంగా అందుబాటులో ఉండటం లేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి తండాకు రోడ్డు నిర్మించడంతో పాటు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్, ఆవుల ప్రభాకర్, అపారదాపు రాజు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):  ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...
ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలి.
అంబేద్కర్‌ను అవమానిస్తే సహించం.
జవహర్ నగర్ మల్కారంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
నిరుపేద MBBS విద్యార్థినికి అండగా డా. కవ్వంపల్లి.
భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.
జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.