జవహర్ నగర్ మల్కారంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
జవహర్ నగర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవ
హర్ నగర్ మల్కారం ప్రాంతంలో పీవీఎం రమేష్, పీవీఎం జగ్గా, పీవీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు, కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ నూరుద్దీన్ ఫారూఖ్ బాయ్‌ను ఆహ్వానించారు. ముఖ్య అతిథులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలనే సందేశంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమని పానుగంటి బాబు, మహమ్మద్ నూరుద్దీన్ ఫారూఖ్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోహెల్, పానుగంటి బాబు మాజీ కార్పొరేటర్‌తో పాటు పలువురు స్థానికులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


Comments