రేవల్లిలో ఘనంగా మండల స్థాయి క్రీడా పోటీలు.

రేవల్లిలో ఘనంగా మండల స్థాయి క్రీడా పోటీలు.

రేవల్లి,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేవల్లి క్రీడా ప్రాంగణంలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రేవల్లి గ్రామ సర్పంచ్ రాజయ్య, ఎంపీడీఓ కీర్తన, మండల విద్యాధికారి ఎస్. వరప్రసాద్ రావు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్, జిల్లా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రామమూర్తి పాల్గొని పోటీలను ప్రారంభించారు. మండలంలోని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పోటీల నిర్వహణలో పాల్గొన్నారు.సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి కుమార్, ఎంపీడీఓ కీర్తన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.విజేతలు: కబడ్డీ బాలికల్లో కేజీబీవీ రేవల్లి ప్రథమ, జడ్పీహెచ్ఎస్ రేవల్లి ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కబడ్డీ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ రేవల్లి ప్రథమ, జడ్పీహెచ్ఎస్ నాగపూర్ ద్వితీయ స్థానాలు సాధించాయి. ఖో ఖో బాలికల్లో జడ్పీహెచ్ఎస్ నాగపూర్ ప్రథమ, జడ్పీహెచ్ఎస్ రేవల్లి ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఖో ఖో బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ నాగపూర్ ప్రథమ, జడ్పీహెచ్ఎస్ తలుపునూరు ద్వితీయ స్థానాలు సాధించాయి. వాలీబాల్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ రేవల్లి ప్రథమ, జడ్పీహెచ్ఎస్ తలుపునూరు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):  ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...
ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలి.
అంబేద్కర్‌ను అవమానిస్తే సహించం.
జవహర్ నగర్ మల్కారంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
నిరుపేద MBBS విద్యార్థినికి అండగా డా. కవ్వంపల్లి.
భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.
జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.