వినాయక నిమజ్జనంపై పోలీసుల సూచనలు.
డీజేలకు అనుమతి లేదు -ముల్కనూర్ఎస్ఐ.రాజు
Views: 21
On
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 19తెలంగాణ ముచ్చట్లు):
వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు సూచించారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని స్పష్టం చేశారు.
ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనానికి ముందుగానే పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాల్లోనే ఊరేగింపు నిర్వహించాలని తెలిపారు. నిమజ్జన మార్గంలో ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండి, భక్తిశ్రద్ధలు, సోదరభావంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Sep 2026 20:12:04
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...


Comments