జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థినుల నిరసన.
పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీం’లో విలీనం చేయొద్దని డిమాండ్.
Views: 0
On
కరీంనగర్, సెప్టెంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు తరగతులను బహిష్కరించి నిరసనకు దిగారు. జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీం’లో కలపవద్దని, వాటిని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కళాశాల ఆవరణలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పరిపాలన, విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జీవో 97ను ఉపసంహరించుకోవాలని విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Sep 2026 20:12:04
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...


Comments