"బొజ్జ గణపయ్యకే వలలు - కోతుల బెడదతో వింత పరిస్థితి".

గడ్డం హరికృష్ణ

*భక్తితో పూజించాల్సిన పరిస్థితి నుండి...బంధించి కాపాడాల్సిన దుస్థితి*

*ప్రసాదాలు ఎత్తుకెళ్లకుండా... నిర్వాహకుల వినూత్న ఆలోచన*

చిల్పూర్,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక మండపాలకు వింత సమస్య ఎదురైంది. కోతుల బెడదతో భక్తులు, కమిటీ నిర్వాహకులు గణనాథుడి చుట్టూ ఇనుప వలలు, నెట్లు ఏర్పాటు చేస్తున్నారు. దండలు, పండ్లు, లడ్డూ, ప్రసాదం, కొబ్బరికాయలు కోతులు ఎత్తుకెళ్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న వేళ, స్టేషన్ ఘనపూర్ తో పాటు చిల్పూర్, జాఫర్ ఘడ్, లింగాల గణపురం మండలంలోని ని పలు గ్రామాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంది. గుట్టలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 200కు పైగా మండపాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భక్తితో పూజించాల్సిన గణనాథుడిని వలల్లో బంధించి కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతులను అడవుల్లోకి తరలించాలని కోరుతున్నారు. మండపం చుట్టూ పక్కల వలలు కట్టి, భక్తులు దర్శనం చేసుకునేందుకు చిన్నద్వారం ఏర్పాటు చేశారు. దీంతో కోతులు లోపలికి రాకుండా విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతున్నారు. కమిటీ సభ్యుల ఈ ఆలోచనలకు భక్తులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రతి ఏటా కోతుల వల్ల అలంకరణ పాడవుతుండేది. ఈసారి వాళ్ళని వల్ల ప్రశాంతంగా పూజలు చేసుకోగలుగుతున్నాం" అని గ్రామస్తులు తెలిపారు. వినాయక ఉత్సవాలు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్సవాలు ప్రశాంతంగా, ఇలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

*మండపం నిర్వాహకుడు - గడ్డం హరికృష్ణ, చిల్పూర్ గుట్ట*

"మేము 9 అడుగుల గణపతిని తెచ్చాం. మా గ్రామంలో కోతుల గుంపులు గుంపులుగా వచ్చి ఎవరి చేతిలో ఏది ఉన్నా లాక్కొని వెళ్తాయి, దీంతో ప్రతి యేట వినాయక మండపానికి కోతుల బెడద వల్ల వలలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. వల ఏర్పాటు చేయకోతే కోతుల గుంపు వచ్చి పూల దండలు  కింద పడేసి చిందర వందర చేసేవి, అందుకే డబ్బులువెచ్చించి  మండపం చుట్టూ వల(నెట్) వేశాం. ఇప్పుడు భక్తులు వల లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు." 

*భక్తుడు - ఒగ్గు రాజు, పామునూరు (స్టేషన్ ఘనపూర్)*

"పిల్లలతో హారతి ఇద్దామని వస్తే కోతులు మీద పడుతున్నాయి. పోయిన ఏడాది నా చేతిలో ఉన్న పులిహోర ప్యాకెట్ లాక్కెళ్లింది. ఇప్పుడు వలలు వేశాక కాస్త ధైర్యంగా పూజకు వస్తున్నాం, కానీ గణపయ్యకు వలలు కట్టడం మాత్రం బాధగా ఉంది." కానీ కోతుల బెడద వల్ల తప్పడం లేదు...

*రంగు రవి గౌడ్, రైతు రాజవరం(చిల్పూర్):*
"కోతుల బెడద పొలాల్లోనే కాదు, ఇప్పుడు దేవుడి మండపాల దాకా వచ్చింది. పండగ 11 రోజులు ఉంటది, అన్ని రోజులు ఇలా వలల్లో గణపతిని ఉంచడం బాధాకరం. ప్రభుత్వం కోతుల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి."

IMG-20260919-WA0012
ఒగ్గు రాజు
IMG-20260919-WA0013
రాజారపు రంజిత్
IMG-20260919-WA0014
కోతుల బెడదకు గణనాథుడికి చిల్పూర్ లో వల ఏర్పాటు చేసిన నిర్వాహకులు

ప్రభుత్వం కోతులను బంధించి అడవుల్లో వదిలిపెట్టాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):  ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...
ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలి.
అంబేద్కర్‌ను అవమానిస్తే సహించం.
జవహర్ నగర్ మల్కారంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
నిరుపేద MBBS విద్యార్థినికి అండగా డా. కవ్వంపల్లి.
భయాన్ని కాదు.. భరోసాను ఇవ్వాలి.
జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.