తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు.
పైప్‌లైన్ పనులు ప్రారంభించిన వంగరసర్పంచ్ .
Views: 0
On
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వంగర గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన నూతన పైప్‌లైన్ పనులను గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ ప్రారంభించారు.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధుల ద్వారా మంజూరైన రూ. రెండు లక్షలతో నూతన పైప్‌లైన్ పనులను చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు.
గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నూతన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి అందుతున్న నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరన్న నాయక్, వార్డు మెంబర్లు రామారావు, స్వరూప, మారం సతీష్, గజ్జల రమేష్, బత్తిన అశోక్, కాల్వ సంపత్, రామవరపు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Sep 2026 20:12:04
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి...


Comments