బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు.

బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు.

వనపర్తి,సెప్టెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి కోసం ఆయకట్టు రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా పెద్దమందడి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను పెద్దమందడి పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ముందస్తు అరెస్టులను బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు.జూరాల ప్రాజెక్టు కాలువలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు వెంటనే కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు.రైతుల ఆందోళనకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు జూరాల వద్దకు వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రైతుల సమస్యకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకుని అరెస్ట్‌ చేయడం సరికాదని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. రైతుల తరఫున తమ గొంతు వినిపించకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని వారు ఆరోపించారు.సాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి జూరాల కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. అరెస్టు అయిన వారిలో మండల అధ్యక్షుడు వేణు, వెల్టూర్ సర్పంచ్ అశోక్, సేనాపతి, కురుమూర్తి, సురేష్ కుమార్, బ్రహ్మయ్య, విష్ణు, పురుషోత్తం రెడ్డి, హనుమంతు, యాదయ్య తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం. టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):  టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ లిమిటెడ్, గచ్చిబౌలిలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీఎన్‌జీవోస్ యూనియన్ అధికారిక...
వినాయక నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి.
కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.
బీఎస్ఎఫ్ రెండు దశాబ్దాల ఉత్సవాలను విజయవంతం చేయండి.
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు.
నేడు పెద్దమందడిలో మండల స్థాయి క్రీడా పోటీలు.
బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు.