కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.

బాపూజీ పోరాట స్ఫూర్తికి నివాళి.

కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.

హుజురాబాద్, సెప్టెంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. భూమి ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఆధ్వర్యంలో పద్మశాలి సమాజం నాయకులు, ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలను నాయకులు గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని నాయకులు తెలిపారు. ఆయన నిబద్ధత, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
ఆశయాలను కొనసాగించాలిబాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు అన్నారు. ముఖ్యంగా యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పద్మశాలి సమాజం నాయకులు, సభ్యులు, భూమి ఇండియా టుడే న్యూస్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం. టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):  టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ లిమిటెడ్, గచ్చిబౌలిలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీఎన్‌జీవోస్ యూనియన్ అధికారిక...
వినాయక నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి.
కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.
బీఎస్ఎఫ్ రెండు దశాబ్దాల ఉత్సవాలను విజయవంతం చేయండి.
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు.
నేడు పెద్దమందడిలో మండల స్థాయి క్రీడా పోటీలు.
బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు.