డాక్టర్ కందుల సుధాకర్ కు అక్షర కిరీటి బిరుదు ప్రధానం .
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 20(తెలంగాణ ముచ్చట్లు )
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ సంస్థ భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ మరియు ఐ ఏ ఎ ఎస్ రాహుల్ చేతులు మీదుగా సెప్టెంబర్ 20 వ తేదీన భద్రాద్రి కవిత పండుగలో ఏటపాక డాక్టర్ పాలురాజు ఇంజనీరింగ్ కళాశాల పోలవరం జిల్లా భద్రాద్రి లో నిర్వహించిన మెగా కవి సమ్మేళనంలో ఖమ్మం జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత నంది అవార్డు గ్రహీత డాక్టర్ కందుల సుధాకర్ పాల్గొని
చెట్టు మనసు అనే కవితను ఆలపించారు దీని గాను భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ ఐ ఏ ఎ ఎస్ మరియు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం మరియు భద్రాద్రి కమిటీ సభ్యులు అందరూ కలిసి డాక్టర్ కందుల సుధాకర్ కి అక్షర కిరిటి బిరుదును ప్రధానం చేసి,మేమెంటో మరియు సర్టిఫికెట్ శాలువా తో ఘనంగా
సత్కరించారు తనకు అక్షర కిరిటీ బిరుదులు ప్రధానం చేసిన ఐటీడీఏ పిఓ మరియు ఐ ఏ ఎ ఎస్ రాహుల్ కి మరియు శ్రీ శ్రీ కళావేదిక కమిటీ సభ్యులకు మరియు భద్రాద్రి కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఇంకా తెలుగు భాష సాహిత్యానికి అహర్ని శలు కట్టించి పనిచేస్తా నని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడీఏ పిఓ మరియు ఐ ఏ ఏ ఎస్ రాహుల్ మరియు ప్రముఖులు
పంచాక్షరయ్య,, శ్రీనాధ వంశస్థులు భక్త రామదాసు వంశస్థులు, తదితరులు పాల్గొన్నారు.


Comments