ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి ఫౌండేషన్ అండ.

పుస్తకాల కొనుగోలుకు రూ.10 వేల ఆర్థిక ప్రోత్సాహకం.

ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి ఫౌండేషన్ అండ.

పెద్దమందడి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు గట్టు యువరాజ్ ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ప్రజావైద్యశాల డాక్టర్ మురళీధర్ చేతుల మీదుగా యువరాజ్‌ను సన్మానించారు.విద్యార్థి వైద్య విద్యకు అవసరమైన పుస్తకాల కొనుగోలు కోసం ఫౌండేషన్ తరఫున రూ.10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. యువరాజ్ పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్‌లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష. ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష.
వనపర్తి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత...
డాక్టర్ కందుల సుధాకర్ కు అక్షర కిరీటి బిరుదు ప్రధానం  .
వర్ష బీభత్సంపై మేయర్ క్షేత్రస్థాయి పరిశీలన.
స్వచ్ఛ కరీంనగర్ మా లక్ష్యం.. సమగ్రాభివృద్ధే మా ధ్యేయం.
ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి ఫౌండేషన్ అండ.
పెద్దమందడిలో దూకుడు పెంచుతున్న అల్వాల వెంకట్‌ రెడ్డి.
జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.