ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష.

పరీక్షకు హాజరైన సుమారు 400 మంది అభ్యర్థులు.

ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష.

వనపర్తి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష విజయవంతంగా జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు  మధుకర్ స్వామి ఆధ్వర్యంలో వనపర్తిలోని రేడియంట్ హైస్కూల్, తిరుమల హిల్స్ ఆవరణలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 400 మంది విద్యార్థులు, అభ్యర్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్ రెడ్డి హాజరై అభ్యర్థులను అభినందించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో పాటు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాలని సూచిస్తూ అభ్యర్థులకు ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్, డా. గద్దె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పరి తిరుమలేష్, శైలజ, బాలా సుబ్రహ్మణ్యం, వెంకటేష్, మల్లేష్, రాహుల్, భాను, రజిత తదితరులు సహకరించారు.యువతలో పోటీ పరీక్షలపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు గద్దె భాస్కర్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష. ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష.
వనపర్తి,సెప్టెంబర్20(తెలంగాణ ముచ్చట్లు): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత...
డాక్టర్ కందుల సుధాకర్ కు అక్షర కిరీటి బిరుదు ప్రధానం  .
వర్ష బీభత్సంపై మేయర్ క్షేత్రస్థాయి పరిశీలన.
స్వచ్ఛ కరీంనగర్ మా లక్ష్యం.. సమగ్రాభివృద్ధే మా ధ్యేయం.
ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి ఫౌండేషన్ అండ.
పెద్దమందడిలో దూకుడు పెంచుతున్న అల్వాల వెంకట్‌ రెడ్డి.
జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.