టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
టీఎన్‌జీవోస్ మాక్ సొసైటీ లిమిటెడ్, గచ్చిబౌలిలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీఎన్‌జీవోస్ యూనియన్ అధికారిక ప్యానెల్ అభ్యర్థులు కారం రవీందర్ రెడ్డి, కట్కూరి శ్రీకాంత్ విజయం సాధించారు.సొసైటీలో మొత్తం 2,107 మంది సభ్యులకు గాను 867 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో ఏడు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. కారం రవీందర్ రెడ్డికి 583 ఓట్లు, కట్కూరి శ్రీకాంత్‌కు 302 ఓట్లు లభించాయి.
ఎన్నికల అధికారి మోహన్ రావు ఇరువురిని విజేతలుగా అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఉమాదేవి, గోవర్ధన్ రెడ్డి టీఎన్‌జీవోస్ యూనియన్ అధికారిక ప్యానెల్‌కు మద్దతుగా తమ అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడం విశేషం.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను కె. స్వామిగౌడ్, సుధాకర్, దేవిప్రసాదరావు, మీమిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్, ముజీబ్, ఎం.ఏ. హమీద్ తదితరులు అభినందించారు.
సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు తెలిపారు.


Comments