నేడు పెద్దమందడిలో మండల స్థాయి క్రీడా పోటీలు.
పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత.
పెద్దమందడి,సెప్టెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 22 మంగళవారం పెద్దమందడిలో మండల స్థాయి క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి మంజులత తెలిపారు. పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ మంజులత మాట్లాడుతూ.. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో బాలురు, బాలికలకు 14 సంవత్సరాల లోపు, 17 సంవత్సరాల లోపు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు.14 సంవత్సరాల లోపు విభాగంలో పాల్గొనే విద్యార్థులు 2013 జనవరి 1వ తేదీ నుంచి జన్మించిన వారై ఉండాలని, 17 సంవత్సరాల లోపు విభాగంలో పాల్గొనే విద్యార్థులు 2010 జనవరి 1వ తేదీ నుంచి జన్మించిన వారై ఉండాలని వివరించారు.పోటీలకు హాజరయ్యే విద్యార్థులు అసలు పాఠశాల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ఎంఈఓ మంజులత సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆమె కోరారు.


Comments