దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.

- భూ వ్యవహారాలు చట్టబద్ధంగా నిర్వహించుకోవాలి.
- తహసీల్దార్ మద్దినేని మురళి.

దమ్మపేట, సెప్టెంబరు 22 (తెలంగాణ ముచ్చట్లు): 

దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు ఎలాంటి అవకాశం లేదని డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), దమ్మపేట తహసీల్దార్ మద్దినేని మురళి స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తిరిగి దళారులుగా వ్యవహరిస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని, రైతులు, భూ హక్కుదారులు వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ పదవీకాలం కొంతకాలమే ఉంటుందని, అనంతరం తమకు అనుకూలమైన వ్యక్తులే తహసీల్దార్‌గా వస్తారంటూ కొందరు దళారులు రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. భూ బదిలీలు, పట్టా పుస్తకాలు, పాస్‌బుక్కులు తదితర భూ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలైనా పూర్తిగా చట్టబద్ధంగా, రెవెన్యూ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరైనా దళారులు భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ‘పట్టా పుస్తకాలు ఇప్పిస్తాం.. పాస్‌బుక్కులు ఇప్పిస్తాం.. భూ సమస్యను పరిష్కరిస్తాం’ అంటూ ప్రలోభాలకు గురిచేస్తే వారి మాటలు నమ్మవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తుల గురించి వెంటనే దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వ్యక్తుల కార్యకలాపాలపై ఇప్పటికే నిఘా ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండి దళారుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దళారీ వ్యవస్థ పట్ల అప్రమత్తంగా ఉండి.. భూ వ్యవహారాల్లో చట్టబద్ధమైన విధానాలనే అనుసరించాలని మద్దినేని మురళి సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.