కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.

కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి నియమితులయ్యారు. పార్టీ కోసం నిత్యం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు.పట్టణంలో పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు సమర్థవంతంగా సమాధానం ఇవ్వడంలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషిస్తారని నాయకులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పోశాల కృష్ణమూర్తి మాట్లాడుతూ తనకు పట్టణ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మునిసిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజుతో పాటు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కృష్ణమూర్తి తెలిపారు.
అనంతరం పోశాల కృష్ణమూర్తిని పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.